Telangana Intermediate 1st & 2nd Year Results 2019

అధరం అంచులే మధురం కోరెలే..


Sun,March 17, 2019 11:43 PM

Dear Comrade Teaser Vijay Devarakonda Rashmika Mandanna Kissing Scene Criticised on Twitter

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ ఉపశీర్షిక. మైత్రీమూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. కడలల్లె వేచె కనులే.. కదిలేను నదిలా కలలే..ఒడిచేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం.. విరహం పొంగెనే హృదయం ఊగెనే..అధరం అంచులే..మధురం కోరెలే అంటూ సిద్‌శ్రీరామ్ ఆలపించిన ప్రణయగీతం నేపథ్యంగా టీజర్ ఆకట్టుకుంటున్నది. ఓ వైపు పోరాటం, మరోవైపు ప్రియురాలి గాఢకౌగిలిలో అధరబంధనాలతో సరసోల్లాసంగా టీజర్ సాగింది. జస్టిన్ ప్రభాకర్ స్వరకర్త. నిర్మాతలు మాట్లాడతూ ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్‌సారంగ్, ఎడిటర్: శ్రీజిత్‌సారంగ్, ఆర్ట్: రామాంజనేయులు, మాటలు: జె.కృష్ణ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ.

2579

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles