కడలల్లె వేచె కనులే..


Thu,May 16, 2019 12:09 AM

Dear Comrade Kannada Kadalanthe Lyrical Song

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌'. భరత్‌ కమ్మ దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్‌, బిగ్‌బెన్‌ సినిమాస్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌, మెహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని నిర్మిస్తున్నారు. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలోని ఓ లిరికల్‌ వీడియాను విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ‘కడలల్లె వేచె కనులే, కదిలేను నదిలా కలలే..ఒడిచేరి ఒకటై పోయే తీరం కోరే ప్రాయం..’ అంటూ సాగే ఈ గీతాన్ని సిధ్‌శ్రీరామ్‌, ఐశ్వర్యా రవిచంద్రన్‌ ఆలపించారు. జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరకర్త. ఈ సినిమా పాట విని భావోద్వేగానికి లోనయ్యానని, ఇంటిలో పాట వింటున్నప్పుడు అమ్మ కళ్లలో కన్నీళ్లు రావడం చూశానని విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ వైద్యవిద్యార్థిగా, రష్మిక మందన్న మహిళా క్రికెటర్‌ పాత్రలో కనిపించనున్నారు. కాకినాడ నేపథ్యంలో జరిగే కథ ఇదని చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది.

1176

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles