భయపెట్టే దర్పణం


Tue,March 26, 2019 01:16 AM

darpanam movie teaser launch

తనిష్క్‌రెడ్డి, శుభాంగి పంత్, ఎలక్సియన్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం దర్పణం. క్రాంతికిరణ్ వెల్లంకి, వి.ప్రవీణ్‌కుమార్ యాదవ్ నిర్మాతలు. రామకృష్ణ వెంప దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్ సస్పెన్స్ అంశాల సమ్మిళితంగా సాగే థ్రిల్లర్ సినిమా ఇది. ప్రతి క్షణం ఉత్కంఠను పంచుతుంది. కథాగమనానికి అడ్డు అనే ఆలోచనతో వినోదానికి సినిమాలో చోటు కల్పించలేదు. సాంకేతిక నిపుణుల ప్రతిభను చాటిచెప్పే మంచి సినిమా ఇది అని తెలిపారు. సకలకళావల్లభుడు తర్వాత తాను నటిస్తున్న సినిమా ఇదని, కొత్తదనాన్ని నమ్మి ఈ ప్రయత్నం చేశానని తనిష్క్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, ఎలక్సియన్, సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.

474

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles