సస్పెన్స్ థ్రిల్లర్ దర్పణం


Tue,July 9, 2019 11:56 PM

darpanam lyrical vedio song revealed

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియన్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం దర్పణం. రామకృష్ణ వెంప దర్శకుడు. క్రాంతికిరణ్ వెల్లంకి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని లిరికల్ సాంగ్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంగ్ చాలా బాగుంది. సిద్ధార్థ్ అద్భుతమైన స్వరాల్ని అందించాడు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. అనుక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కథానుగుణంగా టైటిల్ పెట్టాం. నటీనటులందరూ చక్కటి అభినయాన్ని కనబరిచారు అన్నారు. థ్రిల్లర్ చిత్రాల్లో పూర్తి విభిన్న చిత్రమిది. కథ, కథనాలు నవ్యరీతిలో ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: సిద్ధార్థ్, దర్శకుడు: రామకృష్ణ.

344

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles