నటుడు క్రేజీ మోహన్‌ కన్నుమూత


Mon,June 10, 2019 11:38 PM

Crazy Mohan Tamil Comic Legend Dies At 67

ప్రముఖ తమిళ హాస్యనటుడు, నాటకకర్త, రచయిత క్రేజీ మోహన్‌(66) సోమవారం చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నటుడిగా, కథ, సంభాషణల రచయితగా తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు మోహన్‌. అపూర్వ సగోదరగల్‌, ఇంద్రన్‌ చంద్రన్‌, సతీ లీలావతి, మిస్టర్‌ రోమియో, ఆహా, అరుణాచలం, తెనాలి, పంచతంత్రం, పమ్మల్‌ కె సంబంధం, వసూల్‌ రాజా ఎంబీబీఎస్‌ చిత్రాలు రచయితగా క్రేజీ మోహన్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఛలోక్తులు, ప్రాసలతో కూడిన హాస్య సంభాషణలకు ఆయన పెట్టింది పేరు. క్రేజీ మోహన్‌ సంభాషణలు అందించిన చిత్రాలన్నీ తెలుగులో అనువాదమై మంచి విజయాల్ని అందుకున్నాయి. రచయితగానే కాకుండా నటుడిగా ఇండియన్‌, శిష్యా, అరుణాచలం, నాన్‌ ఈ , పుతగంతో పాటు పలు సినిమాల్లో హాస్యనటుడిగా కనిపించారు. కమల్‌హాసన్‌తో ఎక్కువ సినిమాలు చేశారాయన. క్రేజీ మోహన్‌ మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

2837

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles