అల్లు అర్జున్‌తో వన్స్‌మోర్


Fri,February 15, 2019 11:19 PM

crazy beauty pooja hegde romance with allu arjun once again

అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో తెలుగులో పాపులర్ అయింది పూజా హెగ్డే. ఆ తరువాత తెలుగులో వరుస క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిన ఆమెకు తాజాగా మరో క్రేజీ ఆఫర్ లభించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా కియారా అద్వానీ లేదా రష్మిక మందన్న నటించే అవకాశం వుందని ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌కు జోడీగా పూజా హెగ్డేని ఖరారు చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం వున్నట్లు తెలిసింది. గతంలో అల్లు అర్జున్‌తో కలిసి పూజా హెగ్డే డీజే దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో నటించింది. ఇక త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవలోనూ ఆకట్టుకుంది. అందుకే దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం పూజా హెగ్డేని కథానాయికగా ఫైనల్ చేయాలనే ఆలోచనలో వున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలు కానుందని సమాచారం.

2325

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles