నా ఉన్నతికి పుస్తకాలే కారణం


Mon,May 20, 2019 03:42 AM

Cinema Kathalu Book Launch by Vijay Devarakonda and suresh babu

పుస్తకాలు చదవడం చాలా మంచి లక్షణం. నా జీవితంలో బుక్స్ కీలకమైన పాత్రను పోషించాయి. నా ఉన్నతికి కారణమయ్యాయి. నా ఆలోచన విధానాన్ని మార్చివేశాయి అని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. వెంకట్ శిద్ధారెడ్డి రచించిన సోల్ సర్కస్, సినిమా కథలు పుస్తకాల్ని శనివారం హైదరాబాద్‌లో విజయ్‌దేవరకొండ, నిర్మాత సురేష్‌బాబు విడుదలచేశారు. ఈ సందర్భంగా తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలుగులో కథలు కొరత చాలా ఉంది. తమిళ సాహిత్యం నవతరం ఫిలిమేకర్స్‌లో స్ఫూర్తిని నింపుతోంది. వాటి ద్వారా అద్భుతమైన సినిమాలు రూపొందుతున్నాయి. తెలుగులో అలాంటి ప్రయత్నాలు జరగాలి అని చెప్పారు. వెంకట్ శిద్ధారెడ్డి మాట్లాడుతూ 2015లో సోల్‌సర్కస్ పేరుతో తొలి కథ రాశాను. అప్పటి నుంచి సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. త్వరలో అన్విక్షి పబ్లిషర్స్ ద్వారా పెద్దింటి అశోక్‌కుమార్, కాశీభట్ల వేణుగోపాల్ పుస్తకాలను ముద్రించనున్నాం. అలాగే కృష్ణశాస్త్రి, దేవులపల్లి ఆంగ్ల పుస్తకాల్ని తెలుగులో అనువదిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు.

1343

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles