ప్రణయంలో పదనిసలు

Tue,December 3, 2019 11:38 PM

శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధురావు దర్శకురాలు. ధర్మపథ క్రియేషన్స్‌ పతాకంపై రాజ్‌ కందుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు తరుణ్‌భాస్కర్‌, నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ‘ఇంజినీరింగ్‌ చదివి వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడిన ఓ యువకుడి కథ ఇది. ప్రేమ ప్రయాణంలోని మధురభావనలకు, సంఘర్షణకు అద్దం పట్టే చిత్రమిది. ప్రతి సన్నివేశం హృదయాన్నిహత్తుకుంటుంది’ అని చిత్ర బృందం తెలిపింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ అసోసియేషన్‌లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేదరామన్‌, సంగీతం: గోపీసుందర్‌, సంభాషణలు: పద్మావతి విశ్వేశ్వర్‌. దర్శకత్వం: శేషసింధు రావు.

150

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles