హృదయాల్ని గెలుచుకున్నాం


Sat,April 13, 2019 01:06 AM

chitralahari movie thanks meet

చాలా రోజుల తర్వాత విజయోత్సవ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు. టీమ్ అందరిది. ఈ సినిమాకు కనెక్ట్ అయిన యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల విజయమిది అని అన్నారు సాయితేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం చిత్రలహరి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కిషోర్ తిరుమల దర్శకుడు. నివేథా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్‌చేసి వసూళ్లు బాగున్నాయని సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.

ఆదివారంలోగా బ్రేక్ ఈవెన్ అవుతామని సోమవారం నుంచి లాభాల్లోకి అడుగుపెడతామని చెబుతున్నారు. మార్నింగ్ షోతో పోలిస్తే మ్యాట్నీ ఆట నుంచి వసూళ్లు పెరిగాయి. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్‌ను రాబడుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ ఏ సక్సెస్ కోసమైతే టీమ్ అందరం సమిష్టిగా కష్టపడ్డామో ఆ విజయాన్ని ప్రేక్షకులు అందించారు. సినిమాలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. యువతరం తమ కథలా ఉందని చెబుతుండటం సంతోషాన్ని కలిగిస్తున్నది అని పేర్కొన్నారు. సాయితేజ్ మాట్లాడుతూ నిజాయితీగా చేసిన మంచి సినిమా ఇది. తమ జీవితాన్ని తెరపై దర్శించుకున్నట్లుందని, తమ కథే చెప్పారని చాలా మంది సోషల్‌మీడియా ద్వారా సందేశాల్ని పంపుతున్నారు. తమ సంతోషాన్ని, బాధను పంచుకుంటున్నారు. పక్కింటి కుర్రాడిగా నా పాత్రతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని హృదయాల్ని గెలుచుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపారు.

912

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles