చిరుతో మరోసారి..


Sat,July 6, 2019 12:58 AM

Chiranjeevi Nayanthara reunite for Koratala next

సైరా నరసింహారెడ్డి తర్వాత చిరంజీవి, నయనతార కలయికలో మరో సినిమా రానుందా? అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సైరా అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చిరంజీవి. సామాజిక ఇతివృత్తంతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్లామర్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఇదని, తొలుత పలువురు దక్షిణాది అగ్ర కథానాయికల పేర్లను పరిశీలించిన దర్శకుడు కొరటాల శివ చివరకు నయనతారను హీరోయిన్‌గా ఎంపికచేసినట్లు తెలిసింది.
NAYANNA
ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. ఇందులో చిరంజీవి నలభై ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.

3154

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles