నక్సలిజం నేపథ్యంలో?

Sat,November 2, 2019 12:12 AM

ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజికాంశాన్ని చర్చిస్తారు దర్శకుడు కొరటాల శివ. వాణిజ్య అంశాలకు బలమైన సందేశాల్ని జోడించడం ఆయన శైలి. తాజాగా చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దసరా పర్వదినాన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని తెలిసింది. కథానుగుణంగా సినిమాలోని ఓ ఎపిసోడ్ నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందని సమాచారం. ఇందులో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. సామాజిక అసమానతలపై చర్చించే ఇతివృత్తమిదని అంటున్నారు. ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని, ఇందుకోసం హైదరాబాద్ శివారులో భారీ సెట్ రూపకల్పన చేస్తున్నారని తెలిసింది.

1000

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles