చిన్నా ప్రేమలో పడితే..


Wed,September 11, 2019 10:54 PM

Chinna Tho Premaga Movie Onlocation Press Meet

ఎస్.ఎన్.చిన్నా, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చిన్నాతో ప్రేమగా. పీవీఆర్ దర్శకుడు. బి.చండ్రాయుడు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. నిర్మాత మాట్లాడుతూ రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే చిత్రమిది. సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ ఈ వారంలో పూర్తవుతుంది. మరోమూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తిచేస్తాం అని చెప్పారు. సస్సెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది అని దర్శకుడు చెప్పారు. నటనకు ఆస్కారమున్న పాత్రలో నటిస్తూనే సినిమాలోని మూడు పాటలకు నృత్యాలను సమకూర్చుతున్నట్లు శివశంకర్ మాస్టర్ చెప్పారు. చిట్టిబాబు, గడ్డం చందు, వైజాగ్ శర్మ, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, కెమెరా:రెబాల సుధాకర్‌రెడ్డి.

426

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles