Telangana Intermediate 1st & 2nd Year Results 2019

డబ్బు కోసం నటించలేదు!


Tue,March 19, 2019 11:57 PM

Chikati Gadilo Chithakotudu Relese On 21st March

హారర్, అడల్ట్ అంశాలు సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. ముద్దుసన్నివేశాలు, స్కిన్‌షోకు ప్రాముఖ్యతనివ్వకుండా వినోదాన్ని నమ్మి రూపొందించాం అని అన్నారు అరుణ్ అదిత్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు. సంతోష్.పి. జయకుమార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో అరుణ్ అదిత్ మాట్లాడుతూ చందు అనే నేటితరం యువకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాను. జీవితభాగస్వామి కోసం అన్వేషిస్తున్న అతడికి ఓ అందమైన అమ్మాయి తారసపడుతుంది. ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్న తర్వాత పెళ్లిచేసుకోవాలని వారు నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. డబ్బుకోసం అడల్ట్ సినిమా చేశావా అని అందరూ అడుగుతున్నారు. కథ నచ్చి ఈ సినిమా చేశాను. జోనర్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రేక్షకులు వినోదాన్ని కోరుకుంటున్నారు.

అలాంటివారందరిని ఈ సినిమా మెప్పిస్తుంది. నాకు ఎలాంటి ఇమేజ్ లేకపోవడంతో చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అన్న భయం ఉండేది. అయితే కథ, వినోదంతో పాటు టీజర్‌కు లభించిన స్పందనతో ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాను. ప్రస్తుతం కొలంబస్ దర్శకుడు రమేష్‌తో టూర్ అనే సినిమా చేస్తున్నాను. ప్రియదర్శి, ప్రిన్స్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమిళంలో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని తెలిపారు.

1404

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles