చేతిలో చెయ్యేసి చెప్పు బావ!


Sat,September 14, 2019 12:31 AM

Chetilo Cheyyesi Cheppu Bava Movie Archives

అరుణ్‌, ఆదిత్య, రోహిణి, పూజా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘చేతిలో చెయ్యేసి చెప్పుబావ’. కట్ల రాజేంద్రప్రసాద్‌ దర్శకుడు. కె.జె.రాజేష్‌, దేవదాస్‌ నిర్మాతలు. ప్రస్తుతం శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇద్దరు ప్రేమికులు చనిపోయి తిరిగి వాళ్ల ప్రేమను ఎలా బ్రతికించుకున్నారన్నదే చిత్ర ఇతివృత్తం. ఐదు పాటలుంటాయి. పోసాని కృష్ణమురళి కీలక పాత్రలో కనిపిస్తారు’ అన్నారు. ‘ప్రేమ, వినోదం, హారర్‌, థ్రిల్లింగ్‌ అంశాలు కలబోసిన చిత్రమిది. ఆసక్తికరమైన కథ, కథనాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కథానుగుణంగా మంచి ఆర్టిస్టులు కుదిరారు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతున్నది’ అని నిర్మాత తెలిపారు. వినూత్న కథా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని నాయికానాయికలు చెప్పారు.

225

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles