నేటి యువతకు అద్దంపట్టే చిత్రమిది!


Wed,March 13, 2019 11:58 PM

cheddi gang movie release on march 22

ఫాస్ట్ కల్చర్‌కు అలవాటుపడ్డ నేటి యువత ఈజీ మనీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అలాంటి పది మంది సాఫ్ట్‌వేర్ యువకులు వారాంతంలో జల్సా చేయడానికి ఓ ఫారెస్ట్‌కి వెళతారు. అక్కడ ఓ హత్య జరుగుతుంది. ఆ హత్యకు వీరికి వున్న సంబంధం ఏమిటి?. చడ్డీగ్యాంగ్ ఎవరు? అన్నది తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు కనగాల

రమేష్ చౌదరి. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం చడ్డీగ్యాంగ్. శ్రీనివాసరెడ్డి, సెంథిల్‌కుమార్, బాబు రాజన్, దేవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రమేష్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఓ వార్తా పత్రికలో చదివిన గిరిజనుల కథని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాను. మలేషియాలో చిత్రీకరించిన ైక్లెమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సహజత్వం కోసం గిరిజనులు నివసించే ప్రదేశంలో వారిపై ఓ పాటని చిత్రీకరించడం జరిగింది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువత మనోభావాలకు అద్దంపట్టే చిత్రమిది. ఈజీ మనీ ముసుగులో విలువైన బంధాల్ని పట్టించుకోవడం లేదని మంచి సందేశంతో రూపొందిన చిత్రమిది. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అన్నారు.

964

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles