చాణక్య అన్వేషణ


Thu,June 13, 2019 12:59 AM

Chanakya poster Gopichand stands out from the crowd in first look of Thiru spy thriller

గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం చాణక్య. తిరు దర్శకుడు.రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. గోపీచంద్ పుట్టినరోజు పురస్కరించుకొని బుధవారం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో పొడవైన గడ్డంతో మెడలో స్కార్ఫ్ ధరించి గోపీచంద్ వినూత్నంగా కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. చాణక్య అనే గూఢచారికి వృత్తిలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడి అన్వేషణ ఎవరి కోసం అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. గూఢచారిగా గోపీచంద్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుంది. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ, కథనాలు నవ్యరీతిలో సాగుతాయి. బాలీవుడ్ నటి జరీనాఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రీ పళనిస్వామి.

809
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles