శ్రావణి చేరిన మజిలీ


Mon,March 18, 2019 11:58 PM

Chaitanya Samantha and Shiva Nirvana film Majili Release Date is on April 5th

ఆ అమ్మాయి పేరు శ్రావణి. పేరుకు తగినట్లుగానే ఆమె వదనంలో శ్రావణ లక్ష్మీకళ ఉట్టిపడుతుంటుంది. సంప్రదాయాలను, కుటుంబ అనుబంధాల్ని ఎంతగానో గౌరవించే శ్రావణి వైవాహిక జీవితంలో జరిగిన సంఘటనలేమిటి? జీవన సహచరుడితో ఆమె ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఇవన్నీ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకురానుంది. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ విశాఖపట్నం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌ను కోటిమంది వీక్షించారు. మధ్యతరగతి దంపతుల జీవితానికి దృశ్యరూపంగా హృద్యమైన భావోద్వేగాలు మేళవించిన చిత్రమిది అన్నారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: సాహిసురేష్, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.

1311

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles