వినోదాల బుర్రకథ


Wed,May 8, 2019 12:28 AM

burrakatha movie teaser launch

రెండు బ్రెయిన్‌లతో పుట్టిన ఓ యువకుడి కథ ఇది. ఇందులో అభి, రామ్ అనే భిన్న పార్శాలున్న పాత్రలో ఆది కనిపిస్తారు. అభి పాత్ర దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలా
సున్నితంగా కనిపిస్తే రామ్ పాత్ర శ్రీశ్రీ రచనలా ఉత్సాహంగా ఉంటుంది అని అన్నారు డైమండ్త్న్రబాబు. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం బుర్రకథ. ఆదిసాయికుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్నారు. బీరమ్ సుధాకర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ దీపాల, కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు శివనిర్వాణ, అజయ్‌భూపతి విడుదలచేశారు.

ఈసందర్భంగా శివనిర్వాణ మాట్లాడుతూ టైటిల్ బాగుంది. రత్నబాబు డైలాగ్స్, ఆది కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరాయి అని తెలిపారు. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న దర్శకుల జాబితాలో రత్నబాబు పేరు చేరాలని దర్శకుడు అజయ్‌భూపతి ఆకాంక్షించారు. జూన్ మొదటివారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ ఆద్యంతం వినోదభరితంగా సాగే సినిమా ఇది.

ఆది తన పాత్రకు వెయ్యిపాళ్లు న్యాయం చేశాడు. సినిమా విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాం అని చెప్పారు. ఆది మాట్లాడుతూ డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. నటుడిగా సవాల్‌గా భావించి ఈ సినిమా చేశాను. కథ, నా పాత్ర గురించి రత్నబాబు చెప్పగానే ఉత్సుకతకు లోనయ్యాను. వినోదంతో పాటు చక్కటి ఉద్వేగాలు ఉంటాయి. పతాక ఘట్టాలు భావోద్వేగానికి లోనుచేస్తాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్తీ చక్రవర్తి, గాయత్రి గుప్తా, సాయికార్తీక్, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

901

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles