కమెడియన్స్‌ను బ్రతికించండి!


Fri,September 7, 2018 12:07 AM

brahmanandam speech at silly fellows pre release event

సునీల్, అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సిల్లీ ఫెలోస్. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు. పూర్ణ, నందినిరాయ్ కథానాయికలు. కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి నిర్మాతలు. నేడు ప్రేక్షకులముందుకొస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ భీమినేని శ్రీనివాసరావుతో నాకు 26ఏళ్ల అనుబంధం ఉంది. ప్రతి విషయంలో పర్‌ఫెక్షన్ కోరుకునే దర్శకుల్లో ఆయనొకరు. కమెడియన్స్‌ను ఎంకరేజ్ చేసి నాలుగు రోజులు బ్రతికించండి. ఈ సినిమా చూసి వినోదాన్ని ఆస్వాదించండి అన్నారు. సుడిగాడు తర్వాత భీమినేనితో కలిసి నేను చేస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సునీల్‌గారు ఈ సినిమాకు ప్రాణమిచ్చారు. ఆయన పాత్ర ప్లస్ అవుతుంది. ఎలాంటి ఇగో సమస్యలు లేకుండా ఇద్దరం కలిసి పనిచేశాం. ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్నందించే చిత్రవుతుంది అని నరేష్ చెప్పారు. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని సునీల్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ దాదాపు సంవత్సరం పాటు స్క్రిప్ట్‌మీద వర్క్ చేశాం. కథకు స్పీడ్‌బ్రేకర్స్‌లా వుంటాయని కేవలం రెండే పాటల్ని పెట్టాం. ఈ సినిమాతో సునీల్ కమెడియన్‌గా పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది. వినోదాల విందుభోజనంగా అందరిని మెప్పించే చిత్రమిది అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

3226

More News

VIRAL NEWS