శ్రీదేవి జీవితచరిత్ర

Mon,December 2, 2019 10:53 PM

దివంగత నటి శ్రీదేవి జీవిత చరిత్రను ‘శ్రీదేవి ది ఎటర్నల్‌ స్క్రీన్‌ గాడెస్‌' పేరుతో రచయిత సత్యార్థ్‌ నాయక్‌ రచించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఈ పుస్తకాన్ని బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకునే, శ్రీదేవి భర్త నిర్మాత బోనీకపూర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా దీపికాపదుకునే మాట్లాడుతూ ‘శ్రీదేవి జీవితంపై రాసిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించడం గౌరవంగా భావిస్తున్నాను. నేను నటించిన సినిమాలు శ్రీదేవి చూసేవారు. వ్యక్తిగతంగా అభినందిస్తూ సందేశాలు పంపిస్తుండేవారు’ అని పేర్కొన్నది. ఈ పుస్తకానికి బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ ముందుమాట రాశారు. ‘శ్రీదేవి నటనాజీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇనిస్టిట్యూట్‌. ఆమె జీవితచరిత్రకు ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని కాజోల్‌ వ్యాఖ్యానించారు. శ్రీదేవి బాల్యం నుంచి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న పరిస్థితుల్ని, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆమె జీవితంలోని ఆసక్తికరమైన విషయాల్ని చర్చిస్తూ రచయిత ఈ పుస్తకాన్ని రచించారు.

250

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles