గన్‌షూటింగ్ ప్రాక్టీస్


Sat,January 5, 2019 11:24 PM

Bollywoods golden girl Taapsee Pannu poses on magazine cover

గత ఏడాది బాలీవుడ్‌లో హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నది తాప్సీ. ఆమె కథానాయికగా నటించిన సూర్మ, మన్‌మర్జియాన్, ముల్క్ చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. ఈ చిత్రాల్లో తాప్సీ అభినయానికి చక్కటి ప్రశంసలు లభించాయి. ఈ సక్సెస్‌లు అందించిన స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలపై దృష్టిసారిస్తున్నది ఈ పంజాబీ సొగసరి. తాప్సీ కథానాయికగా హిందీలో ఉమెనియాన్ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్నది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చందూ తోమర్, ప్రకాశీ తోమర్ అనే సోదరీమణులు వృద్ధాప్యంలో షూటింగ్ క్రీడలో ప్రతిభను కనబరిచి వందకుపైగా పథకాలు సాధించారు. ఈ అక్కాచెళ్లల్ల జీవితాల ఆధారంగా రూపొందనున్న సినిమా కోసం ప్రస్తుతం తాప్సీ గన్ షూటింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నది.

అంతర్జాతీయ క్రీడాకారుడి ఆధ్వర్యంలో షూటింగ్‌లో మెళకువలను నేర్చుకుంటున్నది. ఈ సినిమాలో తాప్సీ అరవై ఏళ్ల వయసు పైబడిన వృద్ధురాలిగా కనిపించబోతున్నట్లు తెలిసింది. హాలీవుడ్ ప్రోస్థటిక్ మేకప్ ఆర్టిస్ట్‌ల సహకారంతో ఆమె పాత్రను తీర్చిదిద్దనున్నారు. గ్రామీణ నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో సెట్స్‌పైకి రానుంది. అనురాగ్ కశ్యప్, శిభాషిష్ సర్కార్, నిధి పర్మార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహించనున్నారు.

1420

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles