ఐకాన్ కనబడుటలేదు!


Tue,April 9, 2019 12:08 AM

Birthday Special Allu Arjun Here are the upcoming films of the Style Icon of Tollywood

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనంతరం దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం తీసుకున్నారు అల్లు అర్జున్. దాంతో ఆయన తదుపరి సినిమా ఏమిటనేది సస్పెన్స్‌గా మారింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ సోమవారం తన జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్త సినిమాల కబుర్లు వినిపించారు అల్లు అర్జున్. త్రివిక్రమ్, సుకుమార్‌లతో పాటు శ్రీరామ్‌వేణు దర్శకత్వంలో నటించబోతున్నారాయన.

-ఐకాన్ కనబడుటలేదు: అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కలయికలో రూపొందిన ఆర్య, పరుగు, డీజే దువ్వాడ జగన్నాథ్ చిత్రాలు చక్కటి విజయాల్నిసాధించాయి. తాజాగా దిల్‌రాజుతో నాలుగో సినిమాతో చేయబోతున్నారు అల్లు అర్జున్. శ్రీరామ్‌వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి ఐకాన్-కనబడుటలేదు అనే టైటిల్‌ను ఖరారుచేశారు. అద్భుతమైన కథ, కథనాలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఎమ్‌సీఏ సక్సెస్ తర్వాత శ్రీరామ్‌వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పూర్వనిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చిత్రబృందం తెలిపింది.

-ఈ నెల 24 నుంచి షురూ: జులాయి సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ముచ్చటగా మూడో సినిమా రూపొందుతున్నది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజహెగ్డే కథానాయికగా నటిస్తున్నది. డీజే తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ నెల 24 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం సోమవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.

-సుకుమార్‌తో హ్యాట్రిక్ సినిమా: తెలుగు చిత్రసీమలో విజయవంతమైన కాంబినేషన్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్. వీరి కలయికలో మరో సినిమా రాబోతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రంగస్థలం అపూర్వ విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రమిదే కావడం విశేషం.

2026

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles