ప్రేమికుడి యుద్ధం


Tue,April 9, 2019 12:03 AM

Bilampumpudi village story

బైలంపూడి అనే ఊరిలో జరిగిన కథతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు బ్రహ్మానందరెడ్డి. తార క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న చిత్రం బైలంపూడి. హరీష్ వినయ్, తనిష్క తివారి జంటగా నటిస్తున్నారు. అనిల్.పి.రాజ్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ రాజకీయ అంశాలతో సమ్మిళితమైన ప్రేమకథా చిత్రమిది. గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా సినిమాలో ఆవిష్కరిస్తున్నాం. గెలుపుకోసం కాకుండా బతకడానికి ఓ ప్రేమికుడు ఎవరితో యుద్ధ్దం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. కొత్త తరహా కథాంశాల్ని ఇష్టపడే వారిని మా సినిమా మెప్పిస్తుంది అని తెలిపారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈ నెలాఖరున చిత్ర గీతాల్ని, మే నెలలో సినిమాను విడుదలచేస్తామని నిర్మాత చెప్పారు. సుచిత్ర, గోవింద్, నటరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్.

760

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles