విజయం స్ఫూర్తినిచ్చింది


Sun,March 17, 2019 11:41 PM

bilalpur police station movie success meet

హింస, అశ్లీలత, అభ్యంతరకర సన్నివేశాలకు తావు లేని అర్థవంతమైన సినిమా ఇది. ఇంటిల్లిపాది కలిసి చూస్తూ హాయిగా నవ్వుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులందరిని ఈ సినిమా మెప్పించడం ఆనందంగా ఉంది అన్నారు గోరటి వెంకన్న. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్. నాగసాయి మాకం దర్శకుడు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన జంటగా నటించారు. మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ తొలి ఆటను థియేటర్‌లో చూస్తున్నప్పుడు సినిమా కోసం మేము పడిన కష్టమంతా మర్చిపోయాం. కథ బాగుంటే కొత్త నటులు, పాత నటులు అనే భేదాలు లేకుండా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాల్ని ఆదరిస్తారని మరోసారి నిరూపించింది అని తెలిపారు. విడుదలైన అన్ని కేంద్రాల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తున్నదని, నిర్మాతగా తొలి సినిమా విజయాన్ని సాధించడం ఆనందంగా ఉందని, మరిన్ని కథాబలమున్న సినిమాలు చేయడానికి ఈ విజయం స్ఫూర్తినిచ్చిందని నిర్మాత తెలిపారు.

822

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles