పోలీసంటే రియల్ హీరో!

Sat,March 9, 2019 11:53 PM

నిజాయితీతో కూడిన పోలీస్‌పాత్రలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇప్పటి వరకు పోలీస్ కథాంశాలతో తెరకెక్కించిన చిత్రాలతో పోలిస్తే మా బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ అందులో భిన్నంగా వుంటుంది. తప్పకుండా మా చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ వుంటుందనే నమ్మకం వుంది అంటున్నారు కథానాయకుడు మాగంటి శ్రీనాథ్. ఆయన హీరోగా నటించిన చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఎం.ఎస్ క్రియేషన్స్ పతాకంపై నాగసాయి మాకం దర్శకత్వంలో మహంకాళి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ పోలీసులు రియల్ హీరోలు. వాళ్ల అండ లేకుండా సమాజాన్ని ఊహించలేం.అందుకే నాకు ప్రతి పోలీసు అధికారి అంటే అభిమానం. ఒక్క పోలీసులే కాదు చట్టాన్ని రక్షించే ప్రతి ఒక్కరు హీరోలే. బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ చిత్రంలో నేను పవర్‌ఫుల్ పోలీసు అధికారి పాత్రలో నటించాను. బిలాల్‌పూర్ అనే ఊరికి కొత్తగా పోలీసు అధికారిగా వెళ్లిన నాకు అక్కడ ఎలాంటి వింత వింత కేసులు ఎదురయ్యాయి? వాటి పర్యవసానలేమిటి? అనేది పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఈ సినిమా తప్పకుండా హీరోగా నాకు మంచి గుర్తింపునిస్తుందనే నమ్మకం వుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తోట వి రమణ, సంగీతం: సాబూ వర్గీస్.

722

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles