బిలాల్‌పూర్ కహాని


Mon,February 4, 2019 10:46 PM

bilalpur police station is all set to amuse the audience

మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘన జంటగా నటిస్తున్న చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్. ఎం.ఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మించారు. నాగసాయిమాకం దర్శకుడు. గోరెటి వెంకన్న కీలక పాత్రను పోషించారు. మార్చి రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ బిలాల్‌పూర్ అనే ఊరిలోని పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వింత కేసుల నేపథ్యంలో సాగే చిత్రమిది. అశ్లీలతకు తావు లేకుండా చక్కటి కథ, కథనాలతో రూపొందించాం. ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంటాయి అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. నేటి సమాజం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను చర్చిసూ్త రూపొందించిన ఈ చిత్రం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. పెద్ద పంపిణీ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం అని తెలిపారు. ప్రణవి, ఆర్.ఎస్ నందా, వైభవ్ కీలక పాత్రలను పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తోట.వి.రమణ, సంగీతం: సాబూ వర్గీస్, పాటలు: గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, రామాంజనేయులు, మౌనశ్రీమల్లిక్.

1298

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles