ఎన్నో రంగుల జీవితం


Tue,April 16, 2019 12:10 AM

Bharat new pic shows Salman Khan as an old man  actor tweets about his colourful life

సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భరత్. అలీఅబ్బాస్ జాఫర్ దర్శకుడు. దేశభక్తిప్రధానంగా స్వాతంత్య్ర సాధన నాటి నుంచి నేటి వరకు ఉన్న పరిస్థితుల్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జర్నీ ఆఫ్ ఏ మెన్ అండ్ నేషన్ ఉపశీర్షిక. ఈ సినిమాలో తన లుక్‌కు సంబంధించిన తొలిఫొటోను సల్మాన్‌ఖాన్ సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. జుత్తు, గడ్డం నెరిసిపోయిన 60 ఏళ్ల సీనియర్ సిటిజన్‌గా ఆయన లుక్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జన్మించిన భరత్ అనే వ్యక్తి 60ఏళ్ల జీవితానికి దృశ్యరూపమే చిత్ర ఇతివృత్తమని దర్శకుడు తెలిపారు.

తన లుక్‌పై సోషల్‌మీడియాలో సల్మాన్‌ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా తలపై వెంట్రుకలు, గడ్డం తెల్లబడిపోయి కనిపించవొచ్చు...కానీ నా 60ఏళ్ల జీవితంలో ఎన్నో రంగులున్నాయి అని సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. దిషాపటాని, టబు, జాకీష్రాఫ్, సునీల్‌గ్రోవర్ తదితరులు చిత్రంలో ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.

519

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles