యువతకు సందేశం


Fri,September 21, 2018 10:57 PM

Bhagyanagaram Telugu Movie Relese Date October 5th

కన్నడ చిత్రం రాజధాని తెలుగులో భాగ్యనగరం పేరుతో అనువాదమవుతున్నది. యష్, షీనా జంటగా నటించారు. కె.వి.రాజు దర్శకుడు. ఈ చిత్రాన్ని సంతోష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అక్టోబర్ 5న ప్రేక్షకులముందుకురానుంది. నిర్మాత డి.ఎస్.రావు ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన చిత్రమిది. మా సంస్థకు శుభారంభాన్నిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మద్యపానం వల్ల కలిగే దుష్పరిమాణాలను తెలియజేసే చిత్రమిది. చక్కటి సందేశం ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అన్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలో నటించారు. ముమైత్‌ఖాన్ ఐటమ్‌సాంగ్‌లో నర్తించింది.

1721

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles