భాగమతి సమరం


Wed,January 17, 2018 11:40 PM

bhagmatie telugu  movie released on 26 january

bhaagamathie
పేదరికంలో మగ్గిపోతున్న సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నది భాగమతి ఆశయం. ఈ ప్రయత్నంలో మంచి మనసున్న యువకుడు ఆమెకు అండగా నిలబడతాడు. కానీ భాగమతి సంకల్పానికి కొందరు రాజకీయనాయకులు అడ్డంకిగా నిలుస్తారు. ఆమె జీవితాన్ని చీకటిమయం చేస్తారు. దయ్యాలకే భయం పుట్టించే ఓ ఇంట్లో ఆమెను బంధిస్తారు. అక్కడ ఆమెకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఆ ఇంట్లో భాగమతి అడుగుపెట్టడానికి కారణమేమిటన్నదే ఈ చిత్ర కథ అని అంటున్నారు అనుష్క. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం భాగమతి. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. జి. అశోక్ దర్శకుడు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. నిర్మాతలు మాట్లాడుతూ సస్పెన్స్, హారర్ అంశాలు మిళితమైన థ్రిల్లర్ చిత్రమిది. భాగమతి ఎవరు? ఆమె పోరాటం ఎందుకోసమనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో కోటికిపైగా వీక్షించారు. సినిమాకు అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్. ఎస్. తమన్.

2549

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles