బైలంపుడి యుద్ధం


Wed,January 9, 2019 11:52 PM

Bellampudi Movie 1st Song Launch

హరీష్ వినయ్, తనిష్క తివారి జంటగా నటిస్తున్న చిత్రం బైలంపూడి. అనిల్.పి.జి.రాజ్ దర్శకుడు. బ్రహ్మానందరెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని పిల్లల దేవుడు అనే లిరికల్ గీతాన్ని బుధవారం హైదరాబాద్‌లో బాలీవుడ్ నటి మైరా అమిథి విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ గ్రామీణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. బతకడం కోసం చేసిన యుద్ధంలో గెలుపు ఎవరిని వరించిందన్నది ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం అని తెలిపారు. బైలంపూడి అనే ఊరి కథ ఇది. ప్రేమ, రాజకీయ అంశాల సమ్మిళితంగా సాగుతుంది. వాస్తవికతను ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, హరీష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

679

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles