రాక్షసుడు అద్భు తమైన థ్రిల్లర్!


Thu,July 18, 2019 11:03 PM

bellamkonda sreenivas anupama parameswarans rakshasudu trailer

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రాక్షసుడు. రమేష్‌వర్మ పెన్మత్స దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ గత ఏడాది చెన్నైలో నేను, రమేష్‌వర్మ తమిళ చిత్రం రాక్షసన్ చూశాం. మాకు బాగా నచ్చింది. ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలని ఏ స్టూడియోస్ సంస్థను స్థాపించాను. ఈ చిత్ర రీమేక్ కోసం నలుగురు హీరోల పేర్లను పరిశీలించాం. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ అయితేనే బాగుంటుందని భావించి చివరికి ఆయనను హీరోగా ఎంచుకున్నాం.

మా నమ్మకాన్ని నిలబెట్టి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇలాంటి చిత్రాన్ని రీమేక్ చేయడం చాలా కష్టం. రమేష్‌వర్మ ఓ సవాల్‌గా తీసుకుని చేశాడు. తమిళంలో పరిమిత బడ్జెట్‌లో చేశారు. మా సంస్థలో తొలి సినిమా కాబట్టి ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు. టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. తొలి ప్రయత్నంగా మంచి చిత్రాన్ని నిర్మించామనే తృప్తి కలిగింది. ఆగస్టు 2న అభిషేక్ నామా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు అని తెలిపారు. అభిషేక్ నామా మాట్లాడుతూ బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో ఈ చిత్రం భారీ హిట్ చిత్రంగా నిలుస్తుంది. దర్శకుడు రమేష్‌వర్మని కొత్త కోణంలో పరిచయం చేసే చిత్రమిది అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కవచం సినిమా చిత్రీకరణ సమయంలో రమేష్‌వర్మ ఈ రీమేక్ గురించి చెప్పారు.

అప్పటికే పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ఆసక్తి చూపించలేదు. అయితే సినిమా చూసిన తరువాత ఇలాంటి చిత్రాన్ని వదులుకోకూడదని వెంటనే అంగీకరించాను. ఇదొక అద్భుతమైన థ్రిల్లర్. సామాజిక అంశం వున్న సినిమా ఇది. కోనేరు సత్యనారాయణ ఎక్కడా రాజీపడలేదు. ఇలాంటి నిర్మాత లభించడం నా అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రమేష్‌వర్మ, కెమెరామెన్ వెంకట్ సి. దిలీప్, బేబీ దువా కౌశిక్, కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

368

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles