కోలుకోవడానికి చాలా టైమ్ పట్టేదేమో!


Thu,December 6, 2018 12:17 AM

bellamkonda sai srinivas interview about kavacham it will surely surprise audience

ఓ నిర్మాత కొడుకుగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించడం సులువే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీ ఒక్కరు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్‌గా మారుతున్నాయి.ఈ పోటీని తట్టుకుని నిలబడాలంటే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అన్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కవచం. శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.


అంతా లవ్‌స్టోరీస్ చేస్తుంటే మీరు మాత్రం వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తున్నారెందుకని?

-చిన్నతనం నుంచి నాకు యాక్షన్ చిత్రాలంటే చాలా ఇష్టం. మిగతా జోనర్ చిత్రాలతో పోలిస్తే యాక్షన్ చిత్రాలే అత్యధిక స్థాయిలో ఆకట్టుకుంటాయి. యాక్షన్ కథల్లో నటుడిగా విభిన్న కోణాల్ని ప్రదర్శించే అవకాశం వుంటుంది.

సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది?

-సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాను. ఓ ట్రాప్‌లో ఇరుక్కుని తనపై వచ్చిన ఆరోపణల్ని ఎలా అధిగమించాడు? తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. 24 గంటల్లో జరిగే కథ ఇది. సెకండాఫ్ నుంచి వేగం పెరుగూతూ ఆసక్తికర మలుపులు, ట్విస్టులతో సాగుతుంది. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరు ఎవరికి కవచం అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

తొలి చిత్రం నుంచి ఎక్కువగా స్టార్ హీరోయిన్‌లనే ఎంచుకుంటున్నట్టున్నారు?

-డ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని కథానాయకల్ని ఎంచుకుంటున్నాం. పెద్ద హీరోయిన్ వుంటే మార్కెట్ కూడా బాగుంటుంది. పైగా పోస్టర్‌లు చూడటానికి కళకళలాడుతుంటాయి. సీనియర్ హీరోయిన్‌లందరితో చేశాను. ఇకపై కొత్త వాళ్లనే ఎంచుకోవాలేమో.

తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటం ఎలా వుంది?

-ఈ సినిమా ఫస్ట్‌లుక్ రాగానే పోలీస్ గెటప్‌లో బాగున్నావ్ అని చాలా మంది అభినందించారు. చిన్నప్పటి నుంచి పోలీస్ స్టోరీలంటే చాలా ఇష్టం. అమితాబ్ బచ్చన్ నటించిన పోలీస్ సినిమాలన్నీ చూశాను. ఆయన పోలీస్ వేషం వేస్తున్నారంటే అందులో హీరో పేరు విజయ్ అని వుండేది. ఆ సెంటిమెంట్ నాకు కలిసొస్తుందని భావించి సినిమాలో నా పాత్ర పేరు కూడా విజయ్ అనే పెట్టాం.

మీ మార్కెట్‌ని మించి సినిమాల బడ్జెట్ పెరిగిపోతోంది? ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

-గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా చేశాం. శాటిలైట్, హిందీ రైట్స్ అంతా కలిపి దాదాపు 20 కోట్లు వచ్చింది. మరో పది కోట్లు వస్తే సేఫ్ అయినట్లే. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌తో వున్నాను.

ఇప్పటి వరకు మీరు చేసిన చిత్రాల ఫలితాలు ఎలా వున్నా మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించిందని ఫీలయ్యారా?

-నాకు ఎలాంటి ఫ్యాన్ బేస్ లేదు. అందుకే నా దగ్గరికి వచ్చే వాళ్లంతా జెన్యూన్‌గా టాక్ చెప్పేస్తుంటారు. నేను నటించిన సాక్ష్యం, జయ జానకి నాయక సినిమాలు కొత్త పంథాలో వున్నాయని, ఇలాంటి కథల విషయంలో చాలా శ్రమిస్తుంటారని నన్ను కలిసిన వాళ్లు చెబుతుంటారు. ఆ పేరును చెడగొట్టుకోకూడదన్నదే నా తపన.

సాక్ష్యం ఫలితం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసినట్టుంది?

-సాక్ష్యంపై భారీ అంచనాలు పెట్టుకున్నాను. కానీ ఆ సినిమా ఫలితం నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దీని కోసం దాదాపు 200 రోజులు కేటాయించాను. అంతగా శ్రమించిన సినిమా నిరాశపరచడంతో రెండు మూడు రోజులు బయటికి రాలేకపోయాను. వెంటనే కవచం చిత్రీకరణలో పాల్గొనడం వల్ల దాని బారినుంచి బయటపడ్డాను. లేకపోతే నేను కోలుకోవడానికి చాలా టైమ్ పట్టేదేమో.

మీ సినిమాల విషయంలో మీ నాన్న సహకారం ఎలా వుంటుంది?

-ఆయనే నా బలం. నా దగ్గరకు వచ్చిన ప్రతి కథ ఆయన వింటారు.విలువైన సలహాలిస్తారు. ఆయనేకాదు నా చుట్టూ వున్న వాళ్ల సలహాలు కూడా తీసుకుంటాను. పది మంది సలహాలు తీసుకున్నప్పడే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది.

తదుపరి చిత్రాల గురించి?

-మరో నాలుగు చిత్రాలు లైన్‌లో వున్నాయి. వాటి వివరాల్ని నా పుట్టిన రోజున వెల్లడిస్తాను.

2359

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles