బెల్లంకొండ గణేష్‌ చిత్రం మొదలైంది

Sun,October 6, 2019 12:06 AM

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో తనయుడు గణేష్‌ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. బీటెల్‌లీఫ్‌ ప్రొడక్షన్స్‌ మరియు లక్కీ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పవన్‌సాధినేని దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘అందమైన ప్రేమకథ ఇది. గణేష్‌ చక్కగా కుదిరాడు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుంది. ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం దొరికింది’ అన్నారు. ‘కథ విని భావోద్వేగానికి గురయ్యాను. నాన్న, అన్నయ్య ఆశీస్సులతో కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్నా’ అని గణేష్‌ తెలిపారు. చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘ఏడాదిగా ఈ స్క్రిప్ట్‌మీద వర్క్‌ చేస్తున్నాం. దర్శకుడు పవన్‌సాధినేని అద్భుతమైన సబ్జెక్ట్‌ సిద్ధం చేశాడు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. కథానాయకుడిగా గణేష్‌ మంచి పేరు తెచ్చుకోవాలని వి.వి.వినాయక్‌, దిల్‌రాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సురేష్‌బాబు, జెమినీ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: గాంధీ, సంభాషణలు: వివేక్‌ ఆత్రేయ, సంగీతం: రధన్‌, నిర్మాత: బెక్కం వేణుగోపాల్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్‌సాధినేని.

603

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles