భయపెట్టే బంజార


Sat,January 5, 2019 11:21 PM

banjara movie press meet

నాగుల్ దర్శకత్వంలో వర్కింగ్ యాన్ట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం బంజార. కోయ రమేష్ బాబు నిర్మాత. అమృత, తేజేష్ వీర, హరీష్ గౌరి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్న హారర్ చిత్రమిది. క్షుద్ర చిత్రంతో ప్రతిభను చాటుకున్న దర్శకుడు నాగుల్ నవ్యమైన పాయింట్‌తో రూపొందించారు. తనకు జరిగిన అన్యాయంపై ఓ బంజార యువతి ఎలా ప్రతీకారం తీర్చుకున్నదన్నది ఆకట్టుకుంటుంది. కథలోని మలుపులు అలరిస్తాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

1364

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles