వినోదాల బంగారి బాలరాజు


Mon,June 18, 2018 12:14 AM

Bangari Balaraju Movie Opening Video Telugu Latest Movie

రాఘవ్, కరోణ్య కత్రిస్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం బంగారి బాలరాజు. నంది క్రియేషన్స్ పతాకంపై కె.యం.డి.రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. కోట్రేంద దుద్యాల దర్శకుడు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ అంబికాకృష్ణ విడుదల చేశారు. పద్మజ మానేపల్లి ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబికాకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాలోని పాటలు చాలా బాగున్నాయి. కొత్తవారైనా చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు మంచి సంగీతాన్నందించారు. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ వినోదప్రధానంగా సాగే చిత్రమిది. నవతరం ప్రేమ భావనలకు అద్దం పడుతుంది. కథానుగుణంగా చక్కటి బాణీలతో సంగీతం కుదిరింది. త్వరలో సినిమా విడుదల తేదిని ప్రకటిస్తాం అన్నారు.

875

More News

VIRAL NEWS

Featured Articles