బైలంపూడి యుద్ధం


Mon,July 15, 2019 12:28 AM

bailampudi movie release date on july 27

బ్రహ్మానందరెడ్డి నటిస్తూ నిర్మించిన చిత్రం బైలంపూడి. అనిల్.పి.రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్ వినయ్, తనిష్క్ తివారి నాయకానాయికలుగా నటించారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలకానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. నిర్మాత మాట్లాడుతూ బైలంపూడి అనే ఊరిలో జరిగే కథ ఇది. బతకడానికి ఓ యువకుడు సాగించిన సమరమే ఈ చిత్ర ఇతివృత్తం. గ్రామీణ జీవనాన్ని వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాలో ఆవిష్కరించాం అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. చోడవరం ప్రాంతంలో చిత్రీకరణ జరిపాం అని చెప్పారు. కొత్తవాళ్లు చాలా మంది సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, ఈ సినిమా విజయవంతమై అందరికి మంచి పేరుతెచ్చిపెట్టాలని హాస్యనటుడు అలీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్, బెనర్జీ, డైమండ్ రత్నబాబు, శివనిర్వాణ తదితరులు పాల్గొన్నారు.

282

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles