బడుగు జీవుల జీవనచిత్రం


Wed,September 11, 2019 11:02 PM

Badugu Jeevulu Movie Ready For Censor

బడుగు బలహీనవర్గాలకు చెందిన ప్రజల కష్టనష్టాలపై రూపొందిన చిత్రం బి.జె. బడుగు జీవులు ఉపశీర్షిక. ఎస్.బి ప్రొడక్షన్స్ పతాకంపై తోట సుధాకర్, విభూది బాలరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.రోబోట్ సుధాకర్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ఆకట్టుకునే కథ,కథనాలతో బడుగు జీవుల సాధక బాధకాలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ మెప్పించేలా వుంటుంది అన్నారు. బడుగు జీవుల హక్కుల కోసం పోరాడుతూ రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై తెరకెక్కించామని దర్శకుడు తెలియజేశారు. సురేష్‌బాబు, సేయిన్ కాన్‌లోన్, హీనారాయ్, మంజీరా, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: గురుచరణ్, సంగీతం: సతీష్ సాలూరి.

297

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles