ఐరన్‌మెన్ ఇష్టం..


Tue,April 9, 2019 12:06 AM

avengers endgame press meet hyderabad

తెలుగు చాలా కష్టమైన భాష. సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ మార్వెల్ ఆంథమ్ థీమ్ గీతాన్ని ఆలపించాను అని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. హాలీవుడ్ చిత్రం ది అవెంజర్స్ ఎండ్‌గేమ్ కోసం థీమ్ సాంగ్‌ను సమకూర్చారు ఏ.ఆర్.రెహమాన్. తెలుగు పాటను సోమవారం హైదరాబాద్‌లో రానా విడుదలచేశారు. ఈ నెల 26న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ఈ థీమ్‌సాంగ్‌కు బాణీని సమకూర్చడానికి అంగీకరించినప్పుడు విమర్శలు వస్తాయని భయపడ్డాను. కానీ ధైర్యంతో నా మనసుకు నచ్చినట్లుగా సంగీతాన్ని అందించాను. హిందీలో విడుదలచేసిన ఈ పాటకు ఇప్పటికే పది మిలియన్లు, తమిళంలో ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగు గీతానికి రాకేందుమౌళి సాహిత్యాన్ని సమకూర్చారు. దర్శకుడు జో రుస్సో ఇండియా వచ్చినప్పుడు ఈ పాట వినిపించాను. హాలీవుడ్ దర్శకుడు కావడంతో సాహిత్యాన్ని అర్థం చేసుకుంటారో లేదో అని భయపడ్డాను.

కానీ పాట విని ప్రశంసించారు. సూపర్‌హిట్ గీతాన్ని అందించావన్నారు. సూపర్‌మెన్ సినిమాల్లో ఐరన్‌మెన్, బ్లాక్‌పాంథర్ సినిమాలు నాకు ఇష్టం. ప్రజల్లో స్ఫూర్తిని రేకెత్తించే పాటలు అందించడానికి తాపత్రయపడతాను. ప్రస్తుతం 99 సాంగ్స్‌తో పేరుతో ఓ సినిమాకు కథను అందిస్తూ నిర్మిస్తున్నారు. వర్చువల్ రియాలటీ అనే 3డీ సంగీతభరిత చిత్రం చేస్తున్నాను. అలాగే మణిరత్నం తదుపరి సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాను అని తెలిపారు. రానా మాట్లాడుతూ రెండోసారి థానోస్ పాత్రకు గళాన్ని అందించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. మార్వెల్ సినిమాలకు అభిమానిగా డబ్బింగ్ చెప్పే సమయంలో చాలా ఎంజాయ్ చేశాను. ఇంగ్లీష్‌లో రాసిన ఈ కథకు తెలుగు నేటివిటీకి అనుగుణంగా డబ్బింగ్ చెప్పడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. గత సినిమా కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఈ సారి థానోస్ పాత్రకు డబ్బింగ్ చెప్పాను. ఆ పాత్ర అంటే ఇష్టం. అవకాశం వస్తే ఈ పాత్రలో నటిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గేయరచయిత రాకేందుమౌళి పాల్గొన్నారు.

1166

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles