బన్నీ వ్యానిటీ వ్యాన్!


Sat,July 6, 2019 12:56 AM

atracts allu arjun s caravan shocking fecilities

మెగా హీరో అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి భిన్నంగా ఆలోచిస్తుంటారు. ైస్టెలిష్ స్టార్‌గా గుర్తింపును సొంత చేసుకున్న ఆయన ఏది చేసినా కొత్తగా, ైస్టెల్‌గా వుండాలని తాపత్రయ పడుతుంటారు. సినిమాలతో పాటు తను వాడే గాడ్జెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఆయన ఇటీవల తన అభిరుచికి అనుగుణంగా ఓ వ్యానిటీ వ్యాన్‌ను తయారు చేయించుకున్నారు. సకల సౌకర్యాలతో సిద్ధమైన ఈ వ్యానిటీ వ్యాన్ పేరు ఫాల్కన్. దాదాపు 6 కోట్ల వ్యయంతో దీన్ని తయారు చేయించుకున్నారాయన. దీనికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలో నేను ఏదైనా కొనుక్కున్న ప్రతీసారి అభిమానులు ఎల్లప్పుడూ నాపై ప్రేమను కురిపించారు. ఆ విషయాన్ని మాత్రమే ఆలోచిస్తుంటాను. నేను ఇవన్నీ కొనుక్కోగలుగుతున్నానంటే వారికి నాపై వున్న ప్రేమలోని పవరే కారణం. మీకు ఎప్పటికీ రుణపడి వుంటాను. ఇదే నా వ్యానిటీ వ్యాన్. ఫాల్కన్ అని అల్లు అర్జున్ ట్విట్ చేశారు.

936

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles