అట్లీ దర్శకత్వంలో..?


Fri,May 18, 2018 10:45 PM

Atlee To Direct Jr NTR Upcoming Movie 2019

NTR
రాజా రాణి, తేరి, మెర్సల్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు అట్లీ కుమార్. ఆయన త్వరలో ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో కొంత విరామం అనంతరం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు నిర్మాత అశ్వనీదత్. ఈ సక్సెస్ తరువాత రెట్టించిన ఉత్సాహంతో వున్న ఆయన త్వరలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారని, వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి రానుందని తెలిసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతున్నది.

4404
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles