ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది!


Sat,July 20, 2019 12:17 AM

Aswamedham Movie Trailer Launch Dhruva Karunakar Priyadarshi

ధృవ కరుణాకర్ హీరోగా నటిస్తున్న చిత్రం అశ్వమేధం. నితిన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రియా నాయర్, ఐశ్వర్య యాదవ్, శుభ మల్హోత్రా, రూపేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రాత్రి ఈ చిత్ర ట్రైలర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది. హీరో ధృవ సినిమా కోసం చాలా శ్రమించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్ర బృందానికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. ధృవ కరుణాకర్ మాట్లాడుతూ థియేటర్ ఆర్ట్స్ చేశాను. చాలా అవకాశాలు వచ్చాయి. కానీ తెలుగులో నటించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను.

దర్శకుడు చెప్పిన కథ ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా కోసం హాంకాంగ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. పోరాట ఘట్టాల్లో ఎలాంటి డూప్ లేకుండా నటించాను. నన్ను నమ్మి నా కోసం కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే చిత్రమిది. ఆదరిస్తారని ఆశిస్తున్నాం అన్నారు. ఈ చిత్రంలో మాంత్రికుడి పాత్రని పోషించానని, హీరో ధృవ చేసిన సాహసాలు చూసి షాక్ అయ్యాను అని సుమన్ తెలిపారు. పోరాట ఘట్టాలు, కథ, స్క్రీన్‌ప్లే చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి అని దర్శకుడు నితిన్ పేర్కొన్నారు.

283

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles