అశోక్ గల్లా అరంగేట్రం

Thu,November 7, 2019 11:23 PM

అగ్ర హీరో మహేష్‌బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా కథానాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ నెల 10న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. పలువురు సినీ ప్రముఖలు ఈ వేడుకకు హాజరవుతారని చిత్ర బృందం ప్రకటించింది. వినూత్న కథాంశంతో ఈ సినిమా రూపొందించబోతున్నారు. నరేష్, సత్య, అర్చన, సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ప్రసాద్, సంభాషణలు: కల్యాణ్‌శంకర్, ఎ.ఆర్.ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చంద్రశేఖర్ రావిపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.


445

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles