బాలకోటేశ్వరరావు నాటకం


Tue,September 25, 2018 11:22 PM

Ashish Gandhi at Natakam Movie Interview

బాలకోటేశ్వరరావు అనే యువకుడి కథ ఇది. ఎలాంటి బరువు బాధ్యతలు లేని అతడు అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యాన్ని చేపడుతాడు. అదేమిటన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది అని అన్నారు ఆశిష్‌గాంధీ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నాటకం. కళ్యాణ్‌జీ గోగణ దర్శకుడు. శ్రీసాయిదీప్‌చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమకూచిపూడి నిర్మాతలు. ఈ నెల 28న ఈచిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో ఆశిష్‌గాంధీ పాత్రికేయులతో ముచ్చటిస్తూ నా స్వస్థలం హైదరాబాద్. సినిమాలపై ఇష్టంతో చదువును మధ్యలో ఆపేశాను. మోడలింగ్‌తో పాటు కొన్ని లఘు చిత్రాల్లో నటించాను. వాటి ద్వారా వచ్చిన గుర్తింపుతో ఉన్నది ఒకటే జిందగీ, పటాస్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. హీరోగా నా తొలి చిత్రమిది. బాలకోటేశ్వరరావు, పార్వతి అనే జంట స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా ఉంటుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కథానుగుణంగానే బోల్డ్‌గా, రియలిస్టిక్‌గా సినిమాను చిత్రీకరించాం. ప్రేమ, యాక్షన్, రొమాన్స్ హంగుల సమ్మిళితంగా దర్శకుడు కల్యాణ్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఏడేళ్లుగా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి నేను పడుతున్న కష్టాలు చూసి నటుడిగా నాకో మంచి జీవితాన్ని ఇవ్వడానికే మా అన్నయ్య ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. సిటీలో పెరగడంతో పల్లెటూరి పాత్ర కోసం మూడు నెలల పాటు హోమ్‌వర్క్ చేశాను. రంగస్థలం, ఆర్‌ఎక్స్100 కథలతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. రొటీన్‌కు భిన్నమైన కథను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది అని తెలిపారు.

1453

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles