అసలేం జరిగింది షూటింగ్ షురూ!


Fri,February 15, 2019 11:21 PM

asalem jarigindi movie shooting starts

శ్రీరామ్, సంచితా పదుకునే హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న అసలేం జరిగింది చిత్ర షూటింగ్ మొదలైంది. నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి కెమెరా స్విఛాన్ చేయగా, క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి క్లాప్ నిచ్చారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందించారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు. ముహూర్తపు సన్నివేశాన్ని హీరో శ్రీరామ్, డ్యాన్సర్లపై చిత్రీకరించారు. ఈశ్వర్ ఈ సినిమా ద్వారా డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో ఒక సస్పెన్స్ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నందుకు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రజల జీవితాలతో ముడిపడి వున్న కథాంశాన్ని ఎంచుకుని, ఆకర్షణీయమైన రీతిలో చిత్రీకరించే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయన్నారు.

అలాంటి కోవలోకే అసలేం జరిగింది సినిమా వస్తుందని తెలిపారు. క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి. శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని అందమైన లొకేన్లలో సినిమా చేయడం స్వాగతించాల్సిన విషయమన్నారు. నిర్మాత కె. నీలిమా మాట్లాడుతూ తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుతున్నామని, మే చివరిలోపు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకర్‌రెడ్డి, గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి, బొమ్మారం గ్రామ సర్పంచ్ శంకర్, లకా్ష్మరెడ్డి, పాస్టర్ ప్రేమ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

1361

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles