Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ప్రేమలో అసలేం జరిగింది


Mon,March 18, 2019 11:56 PM

asalem jarigindi movie shoot update

శ్రీరాం, సంచితాపడుకునే నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారిగా దర్శకత్వ బాధ్యతల్ని చేపడుతూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై కె.నీలిమా నిర్మిస్తున్నారు. మహావీర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. ఈ చిత్ర రెండో షెడ్యూల్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని సుందరమైన ప్రదేశాల్లో ఇటీవల ప్రారంభమైంది. నిర్మాత కె.నీలిమా మాట్లాడుతూ రెండు పాటలు, పతాకఘట్టం, పోరాటాలు, కొన్ని కీలక సన్నివేశాల్ని తాజా షెడ్యూల్‌లో తెరకెక్కించబోతున్నాం. నిర్మల్ జిల్లా పరిధిలోని కడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో యుగళగీతాన్ని చిత్రీకరించాం. ఇప్పటివరకు ఎవరూ దృష్టిసారించని అతిసుందరమైన ప్రాంతాల్లో షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది.

ఈ నెల 31లోపు టాకీ భాగాన్ని పూర్తిచేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఎడిటింగ్, గ్రాఫిక్స్ వంటి కార్యక్రమాల్ని శరవేగంగా జరుపుతున్నాం. మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. లవ్, సస్పెన్స్ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రం తమకు మంచి టర్నింగ్‌పాయింట్ అవుతుందని హీరోహీరోయిన్లు శ్రీరాం, సంచితాపడుకునే తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. పాటలు యువతరాన్ని ఆకర్షించేలా ఉంటాయి. ఎక్కడా రాజీపడకుండా పాటల్ని చిత్రీకరిస్తున్నాం. ఫైట్ మాస్టర్ శంకర్ రూపకల్పన చేసిన పోరాట ఘట్టాలు రొమాంచితంగా సాగుతాయి అని చెప్పారు.

738

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles