అసలేం జరిగింది?

Sat,January 12, 2019 11:14 PM

ఎక్సోడస్ మీడియా పతాకంపై కె. నీలిమా నిర్మిస్తున్న చిత్రం అసలేం జరిగింది?. ఒకరికి ఒకరు, రోజాపూలు ఫేమ్ శ్రీరామ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాతో కెమెరామెన్ ఎన్‌వీఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర పోస్టర్‌ను శనివారం టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమతి నీలిమా నిర్మిస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరూ తీయని సరికొత్త ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ జరుపాలనుకోవడం బాగుంది. ఇందుకోసం చిత్రబృందం ఆరు నెలల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం అభినందనీయం అని తెలిపారు. నిర్మాత కె. నీలిమా మాట్లాడుతూ ఫిబ్రవరి 11 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తిచేస్తాం. భైరవగీత సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన విజయ్‌రామ్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను అందించారు అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: చిర్రావూరి విజయ్‌కుమార్, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, వెంకటేష్, సంగీతం: మహావీర్, గాయనీగాయకులు: విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, రాంకీ, భార్గవి పిైళ్లె.

1942

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles