గిరిపుత్రుల పోరాటం


Tue,June 11, 2019 11:40 PM

aryas kadamban to release in telugu as gajendrudu on june 21

ఆర్య, కేథరిన్ థెరిస్సా జంటగా నటించిన తమిళ చిత్రం కదంబన్ తెలుగులో గజేంద్రుడు పేరుతో అనువాదమవుతున్నది. రాఘువ దర్శకుడు. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై ఉదయ్‌హర్ష తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 21న ప్రేక్షకులముందుకురానుంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ తమిళంలో విమర్శకులు ప్రశంసలందుకుందీ చిత్రం. ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా నాయకానాయికలు నటించారు. ఆద్యంతం థ్రిల్‌కు గురిచేసే అంశాలతో ఆకట్టుకుటుంది. అడవిని ఆక్రమించుకొని సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించాలనుకున్న సంఘ విద్రోహ శక్తుల పన్నాగాన్ని గిరిపుత్రులు ఎలా ఆటకట్టించారన్నదే చిత్ర కథ. యువన్‌శంకర్‌రాజా సంగీతం ప్రధానాకర్షణగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అన్నారు.

583

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles