పాత్రికేయుడి పోరాటం

Thu,November 21, 2019 11:35 PM

‘సక్సెస్‌లో ఉన్నప్పుడు అందరూ సపోర్ట్‌ చేస్తారు. కష్టకాలంలో అండగా ఉండేవారే నిజమైన స్నేహితులు, కుటుంబసభ్యులు’ అని అన్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. టి. సంతోష్‌ దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఈ నెల 29న విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదలచేసింది. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ‘కుటుంబ ప్రేక్షకులు, యువతరంతో పాటు అన్ని వర్గాల వారు చూడాల్సిన మంచి చిత్రమిది.


ప్రతి విద్యార్థి చదువు వెనకాల అమ్మ కల, నాన్న కష్టం ఉంటుంది. ఆ విద్యార్థి జీవితం నష్టపోతే కుటుంబం మొత్తంపై ఆ ప్రభావం ఉంటుందనే పాయింట్‌తో రూపొందించాం. సమాజంలో జరిగే స్కామ్‌లు, తప్పులను ఎదురించే క్రమంలో ఓ పాత్రికేయుడికి ఎదురైన పరిణామాలు ఉత్కంఠను పంచుతాయి. నిజాయితీతో కూడిన చక్కటి ప్రయత్నమిది’ అని అన్నారు. వాణిజ్య హంగుల కలబోతగా సాగే సందేశాత్మక చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ప్రతి ఒక్కరిని మెప్పించే నవ్యమైన చిత్రమిదని లావణ్య త్రిపాఠి పేర్కొన్నది.

331

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles