అభయ్‌రామ్ సమేత తారక్


Mon,May 21, 2018 12:29 AM

Aravindha Sametha Star Jr NTR Turns 35 Wishes Pour In On Twitter

NTR
జన్మదినం సందర్భంగా తొలి శుభాకాంక్షలను తన గారాల తనయుడు అభయ్‌రామ్ నుంచి స్వీకరిస్తారు ఎన్టీఆర్. అభయ్‌రామ్ పుట్టినప్పటి నుంచి ఎన్టీఆర్‌కు ఇదొక ఆనవాయితీగా మారింది. తనకు లభించే అత్యంత విలువైన శుభాకాంక్షలు అభయ్‌రామ్‌వేనని ఎన్టీఆర్ చెబుతుంటారు. ఆదివారం ఆయన 35వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనయున్ని భుజాలమీదికెత్తుకున్న ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భుజాలమీదకు ఎత్తుకున్న ప్రతీసారి అభయ్ నా కళ్లు మూసేవాడు. ఈసారి ఆ పని చేయడం మానుకున్నాడు. వాడు ఎదుగుతున్నాడు. అభయ్ నుంచి ఫస్ట్ విషెష్ అందుకోవడం ఆనందంగా ఉంది అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. ఆరుపలకలదేహంతో ఎన్టీఆర్ కనిపించిన విధానం అభిమానుల్ని ఆకట్టుకుంది.
ntr-ramcharan

రామ్‌చరణ్ శుభాకాంక్షలు

ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హీరో రామ్‌చరణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు ఆప్యాయంగా కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా.. ఈ ఏడాది నీకు అద్భుతంగా కలిసిరావాలి అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటో అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది.

3032

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles