అభినవ నరకాసురుడు


Fri,February 15, 2019 11:18 PM

aravind swami and sundeep kishan and shriya saran narakasurudu

అరవింద్‌స్వామి, సందీప్‌కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం నరకాసురన్ తెలుగులో నరకాసురుడు పేరుతో అనువాదమవుతున్నది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నమ్మకం, భయం మధ్యన ఐదుగురి జీవితాల నేపథ్యంలో జరిగే కథ ఇది. ఓ వర్షం కురిసిన రాత్రి వారి జీవితాల్లో ఏం జరిగిందన్నదే చిత్ర ఇతివృత్తం. థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ సినిమాలో అరవింద్‌స్వామి పాత్ర చిత్రణ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుంది అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్‌సారంగ్, సంగీతం: రాన్ ఎతాన్ యోహాన్, రచన-దర్శకత్వం: కార్తీక్ నరేన్.

823

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles